More info on :-

Vamana Rao Dasu
Sex:- Male
father:- Vamana Rao Dasu
Spouse:- Vamana Rao Dasu

----------------------------------------------


description:-
Vamana Rao:b.9.3.1896 @ Eluru. Died on 26-4-1982 Married on. 31.3.1915 @ Kurada with Syamalamba d/o Kurada Seshayya & Aadilakshmi. born on 27-8-1903 at Kurada. d.26.4.82 @ Bangalore. She died on 25.12.1982 @ Bangalore. Journalist and writer. Well read and wrote many satirical essays in Telugu Journals. Lived in Madras while working in Andhra Patrika. Later he died in Bangalore.

57.Vamana rao B.9.3.1896 D 26-4-1982 Spouse: Syamalamba B 27-8-1903 D on 25-12-1982
Vamana Rao Dasu

LIFE OF VAMANA RAO Dasu Vamana row garu was the eldest son of Dasu Narayana rao garu. He was born on 9th March 1896 at Eluru. His mother was Smt.Venkatalakshmi garu daughter of Marella Ramayya garu of Ayabhimavaram of West Godavari district in Andhra Pradesh. Since his father was a leading lawyer at Machilipatnam, he had his early education there. However he lost his father in the year1905 at the young age of 9yrs. After the demise of his father, his widowed mother accompanied by his two brothers Hrushikesava rao and Sankarshana rao left for Eluru. He continued his studies at Eluru and then he completed intermediate course at Noble College. While he was studying there he was married to Smt. Syamalamba born in1903, daughter of Kurada Seshayya garu and Adilakshmi garu, on 31.3.1915 at Kurada. After passing intermediate exam from Noble College, he pursued his graduate studies in Presidency College, Madras. However during 1921 he left studies and joined the freedom movement. While he was at Madras he was in the Victoria student hostel of the Presidency College. While he was studying B.A (philosophy), he joined freedom movement at the call of Mahatma Gandhi and left the college.
Subsequently he joined the Vani Printing press owned by his uncle Dasu Kesava rao garu, at Bezwada. While working in Vani press his wife joined him. He was working in Vani press as a Manager. While he was at Bezwada he was living with his mother and his younger brothers who were still studying. He left Bezwada and took up a job in the Telugu daily newspaper Andhra Patrika on its editorial staff in 1925, and came to Madras. While he was continuing in Andhra Patrika his writings in the different Telugu Journals were increasingly popular. His writings were full of humor and dealt with various current social and political issues. His writings were replete with satirical humor and reflected his profound literary knowledge. He was well read and had wide knowledge about Telugu literature and philosophy. His writings were entertaining with subtle humor and enlightening on various subjects. His writings were extremely popular in the Telugu reading circles. He was also having regular weekly talks on the All India Radio center of Madras on various subjects of public interest and occasionally at Vijayawada also. His writings were later published as Kaalakshepam, and Ishtaagoshti. and Tamasha Kulasa. He wrote with pen names of Topeedasu, & Bhavasanchari. During World War II he was editor for war news publication by the then British Government from Madras. He served with Andhra Patrika for 28 yrs and retired in 1954. Thereafter he was contributing articles in Telugu journals like Praja Mata, Dhanka,Anandavani & Andhra Bhoomi. He also undertook translation of a writing by Kaanchi Sankarachaarya into Telugu on his behest. He spent his later years mainly devoting his time to reading books of philosophy . The last years of him and his wife Syamalamba were spent at Bangalore. Sri Vamana rao garu expired on 26-4-82 and his wife breathed her last on 24-12-82. Both died at the residence of their second son Upendra Sai Prasad at Bangalore.

Life history by Dasu Harinarayana rao:
ఆంధ్ర వ్యంగ్య సాహిత్య రంగంలో ఒక విశిష్ట రచయితగా పేరు గాంచిన దాసు వామన రావు గారు 1896 లో ఏలూరు లో మహాకవి దాసు శ్రీరాములు గారి పౌత్రుడిగా జన్మిం చారు. నా సోదరుడైన దాసు అచ్యుత రావు గారి వాక్యాలలో చెప్పాలంటే "తెలుగు సమాజం లోని వివిధ వర్గాల ఆచార వ్యవహారాలలోని మంచి చెడ్డలను నిష్పాక్షికంగా విమర్శించి, సరిదిద్దుకునే సూచనలతో హాస్య వ్యంగ్య మర్యాదతో 'తెలుగు నాడు' అనే కావ్యాన్ని రచించిన శ్రీ దాసు శ్రీరాములు గారికి అన్నీ విధాలా తగిన మనుమడు శ్రీ దాసు వామన రావు గారు. తెలుగులో హాస్య వ్యంగ్యరచనా వ్యాసంగాని అత్యున్నత శిఖరాలకు అధిరోహింప చేసిన సరసుడు పాత్రికేయుడు శ్రీ వామన రావు."
ఆయన తండ్రి దాసు నారాయణ రావు గారికి తల్లి వెంకటలక్ష్మి గారికి రెండవ సంతానం గా కలిగారు. బాల్యం తాతగారైన శ్రీరాములుగారి ఇంటనే జరిగింది. దురదృష్టవశాత్తూ 1905 లో ఆయన తొమ్మిదవ ఏటా పితృవియోగం సంభవించింది. ఆ చిరుప్రాయంలోఅనగా 35వ ఏట స్వర్గస్తులైన దాసు నారాయణ రావు గారికి ముగ్గురుపుత్రులు ఒక పుత్రిక కలిగి యుండిరి. నారాయణ రావు గారు న్యాయవాదిగా తండ్రి శ్రీరాములు గారి వద్ద ఏలూరులో వృత్తి ప్రారంభించి తదుపరి బందరులో కొనసాగించారు. న్యాయ వాదిగా ఉన్నప్పటికీ తండ్రిలోని సాహితీ కళా విశేషాలు ఈయనలో కనిపించాయి. ఈ వివరాలు మా తండ్రి గారైన వామన రావు గారు చెప్పినవి స్మృతి కి వచ్చి నంతవరకు లిఖిస్తున్నాను. పాండిత్యంలో ఆయన రచించిన బుద్ధ నాటకం , వీణా వాద్య ప్రవీణత, నాటక రంగంలో పాల్గొన్న ఆయనలో తండ్రిలాగా బహుముఖ ప్రతిభ గోచరమవుతున్నది. వామన రావు గారి బాల్యం కొంత కాలం బందరు ,ఏలూరు పట్టణములలో జరిగింది. తాత గారు శ్రీరాములు గారు 1908 లో గతించారు. ఆయన 1905 నుండి 1908 వరకు ఏలూరులో తాతగారి వద్దనే పెరిగారు. దేవీభాగవత రచనా కాలంలో మహాకవి శ్రీరాములుగారి వద్ద ఉన్న భాగ్యం లభించినదని చెప్పుతూ ఉండేవారు. తాత గారు కుర్చీలో కూచుని తలపైనా ఒక తడి వస్త్రం వేసుకొని ఆ మహాకవి అనర్గళంగా ఆశు ధారావాహిని ప్రవాహము తో దేవిభాగవత ఆంధ్రీకరణ రచనా దృశ్యం తరుచూ తలుచుకుంటూ ఉండేవారు. ఒక ప్రక్కన పండితుడు సంస్కృత మూల గ్రంధ ప ఠిస్తూ ఉంటే మరో ప్రక్కన వేరొకరు తెలుగులో వ్రాస్తున్నదృశ్యం నాకు మా తండ్రిగారైన వామన రావు గారు వర్ణిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడూ మనుమల చేతకూడా వ్రాయించేవారని చెప్పేవారు
తాత గారి మరణానంతరం విజయవాడలో నివసించేవారు. విద్య చాలావరకు విజయవాడలోనూ ,బందరు నోబుల్ కళాశాలలో పూర్తి గావించి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో వేదాంత శాస్త్రంలో చదువుతూ స్వాతంత్రోద్యమంలో పాల్గొని అసంపూర్తిగా ఆపేశారు. పెద తండ్రి గారైన దాసు కేశవరావుగారి వాణి ముద్రాక్షశాలలో ఉద్యోగిగా చేరారు. 1925 లో వారి తల్లి గతించిన తదుపరి, 1926 లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు గారు స్థాపించిన తెలుగు దినపత్రిక ‘ఆంధ్ర పత్రిక’ సంపాదక వర్గంలో ఉద్యోగిగా చేరి మద్రాసు నగర స్థిర వాసులైయ్యారు. 1954 లో పదవీ విరమణ చేసినంత వరకూ అదే సంస్థలో పని చేశారు.
ఆయనకు వ్యంగ్య మంటే చాలా ఇష్టం ఆయన సంభాషణలు సహజంగా కూడా హాస్యభరితంగా ఉండేవి. గ్రంధ పఠనం, విమర్శ ఆయనకు చాలా ప్రీతికరమైన విషయాలు.నిత్య జీవనంలో ఎక్కువ నిర్లిప్తత గోచరమయ్యేది ఈ విశేషణములు ఆయన రచనల్లో చాలా కనిపిస్తాయి . పత్రిక రచనలే గాక ఎన్నో ఆకాశవాణి ప్రసంగాలు చేసేవారు. ‘వామన వాక్యాలు ‘ అనే శీర్షికతో ప్రసంగాలు చేసేవారు . వాటికి అనధికార గ్రామీణ కార్యక్రమాలలో ప్రధమశ్రేణి పురస్కారం లభించింది. ఆయన రచనలు ఆంధ్ర పత్రికయే గాక చాలా పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. నాకు జ్నాపకమున్నవి ఢంకా, ప్రజామాత,ఆనందవాణి. ఆంధ్రపత్రిక సారస్వతానుబంధం లో “తమాషా ఖులాసా” అనే శీర్షిక క్రిందనూ , ఆంధ్ర వార పత్రిక లో “కాలక్షేపం” అనే శీర్షిక తోను ప్రచురింప బడేవి . ఆయన రచనలన్నీ భావసంచారి,వామనుడు, టోపీ దాసు అను భిన్న నామములతో వెలువడేవి. ఆయన దృష్ట్యా హాస్యమంటే అశ్లీలత అసభ్యా రహిత మైన భాషలో ఉండాలి. ఏ సమస్య విమర్శించినా వ్యంగ్యం ప్రధానముగా ఉండేది. ఉదాహరణకు లంచగొండితనము పైన వ్రాసినది ఇలా ఉన్నది
"భక్తి ప్రపత్తులతో ఒకరి సన్నిధికి వెళ్ళేటప్పుడు, ఫలం, పుష్పం, పత్రం, తోయమ్,ఇవి యెవైన తీసుకొని వెళ్ళాలి. వాటిని వారు స్వీకరించి మనలను ఆశీర్వదించాలి. “కోరిన వర మొసగుమయ్య కోదండపాణి” అని ప్రార్ధించినప్పుడు కోదండపాణి కోపించి కొట్ట వస్తే అది ఉదాత్త లక్షణమూ కాదు దాత లక్షణమూ కాదు. ఎటువంటి ప్రభువు కావాలి మనకు? మనమిచ్చే పత్రం ప్రసన్నవదనులై స్వీకరించాలి శతపత్రం (అం టే తామర పూవు) కూడా అర్పించి అర్చించవచ్చు నన్నారు . కానీ నూరు రూపాయల నోటును ఒక పెద్ద మనిషి ఒక అధికారికి అర్పించి వచ్చి,శత పత్రా ర్చన చేశానన్నాడు. ఇంకో పెద్దమనిషి అష్టోత్తర శత పూజ చేశానన్నాడు. అష్టోత్తర శతం అంటే నూటెనిమిది కానీ, సహస్రార్చన చేయడం కూడా సాహసమైన పని కాదు. ......”
ఆయన రచన్నల్లో అన్ని వ్య్వవస్థలలోని వర్తమాన పరిస్థి తుల హాస్యసహిత విమర్శన తో బాటు జరుగుతున్న పరివర్తనలను సమీక్షించి సూచనప్రాయ హితవులతో కూడిన వ్యంగ్య ము కనిపించుతుంది. ఆయన ఉద్దేశ్యంలో హాస్యం కానీ వ్యంగ్యం కానీ ఒకరులను నొప్పించే దూషణ గా గాని ద్వందార్ధ ములతో శృంగారభావ పూరితమై ఉండకూడదు. విజ్నాన దాయకమై ప్రభోద భరితమై ఉండాలి. ఆయనలో జీర్ణమయి ఉన్న వేదాంతం ఆయన రచనల్లో విశేషించి ప్రతిబింబిస్తోంది. ఒక చోట వారీవిధంగా వ్రాశారు:
“చేతిలో వెన్న ముద్ద ,చెంగల్వ పూదండ, బంగారు మొలత్రాడు పట్టుదట్టి
సందిట తాయత్తుల్ సరి మువ్వ గజ్జలు చిన్ని కృష్ణమ్మ నిన్ను నే చేరి కొలుతు “
అని పాడుతూ, తమ పసిబాలురను ముద్దు పెట్టుకునే తల్లులందరూ ఆ శ్రీ కృష్ణుని భజన చేసే భక్తులే. ఈ విధంగా శ్రీ కృష్ణావతార తత్వం మన జీవితంలో జీర్ణించి పోయింది . అయినప్పటికీ భగవంతుణ్ణి మధ్య మధ్య మరచి పోతూనే ఉన్నాము. ఏ ధనుర్మాసంలోనో భజనలు చేస్తాము. మద్దెలలు తాళాలు పగలి పోయేటట్లుగా గంటకు 60 మైళ్ళ వేగంలో పంజాబ్ మెయిలు లాగున “పరాకు సేయుట పాడి గాదురా” అని గొంతుక చించుకుంటాము. ధనుర్మాసంతో ఈ భజన పూర్తి అవుతుంది. ఈ భగవద్భజన చాలించిన తరువాత భగవంతుని మీద పరాకు చిత్తగిస్తాము.నిజంగా పరాకు చిత్తగించేది మనమే గాని మన విషయంలో భగవంతుడు పరాకు చిత్తగించడు. అందువల్ల-
“పరాకు చేయుట పాడి గాదురా, పరమపురుష వరదా”
అనే పల్లవితో మాటి మాటికీ భగవంతుణ్ణి ధన్యాసి రాగంలో హెచ్చరించవలసిన పని లేదు. ఆ హెచ్చరిక మన మనస్సుకు మనమే చేసుకొని “ధన్యోస్మి, ధన్యోస్మి” అని దధ్యోదనం ప్రసాదం స్వీకరించడం మంచిది."
ఇటువంటి భక్తి భావ ప్రభోదనలు చాలా చోట్ల ఉన్నాయి. నిత్య జీవితంలో ఆయన పరనింద గాని పరుష వచనాల్ని గాని వాడేవారు కారు. బహు శాంత మూర్తి. జీవితంలో "దుఃఖేషు అనుద్విగ్న మనాః సుఖేషు విగతః స్పృహాః " అన్న గీతా వాక్యం ఆచరణలో పెట్టిన ఆత్మజ్నాని, మహా వ్యక్తి. మనకి కనిపించే హాస్య వ్యంగ్యమే కాదు ఆయన రచనలలో భక్తి వేదాంతాలు, దేశ భక్తి కూడా నిమిడీకృతమై ఉన్నాయి. ఆయనకి కర్మకాండల మీద ఎక్కువ విశ్వాసము లేక పోయినా అందుకు వ్యతిరేకించవారు కాదు. ఆయన రచనా విధానం నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది. ఆయన రచనకు ఎక్కువగా కాపీయింగ్ పెన్సిలే ఉపయోగించే వారు. వ్రాత ప్రారంభిస్తే ఆగకుండా కొట్టివేతలు లేకుండా భావావాహిని నిరంతరాయం గా ప్రవహిస్తుంటే నిర్విరారామంగా జరిగేది. అది మరువరాని ఒక అనుభూతి .
బహుసంతాన వియోగం వలన మానసికవ్యధకు గురి అయ్యారు. అది ఆయన వృధ్ధ దశలో బాధా జనితమయింది. 198౦ లో మద్రాసు నుండి తమ ద్వితీయ పుత్రుడైన దాసు ఉపేంద్ర సాయి ప్రసాదు గారి వద్ద నివాసం ఏర్పరుచుకున్నారు .26 ఏప్రిల్ 1982 సంవత్సరమందు బెంగళూరులో ఆయన స్వర్గస్తులయ్యారు.
ఆయన రచనలు కేవలము పైన పేర్కొన్నవి మాత్రమే కాదు, కంచి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర స్వామి వారు ఆయనకు వారి ధర్మ పత్నిగారికి ఉపదేశం చేశారు. స్వామివారి ఆదేశం పై ఆయన రచన ఒకటి ఆంధ్రీ కరించారు. అంతే కాక "ముసుగులో మనిషి" అని Dr.Jekyll and Mr Hyde అను ఆంగ్ల నవలకు తెలుగులో అనువాదించారు. పిల్లల కోసం బాల భారతం అనే పుస్తకము ఆంగ్లములోది తెలుగులోకి అనువాదించారు. ఆ రచనలన్నీ సేకరించి ఇంటర్నెట్ మీద పెట్టాలని కృషి చేస్తున్నాము. తద్వారా వ్యంగ్య హాస్య సాహిత్యానికి అర్పించి యధా శక్తిని సేవ చేసి కృతార్డులమవగలమని ఆశిస్తున్నాము.

More info later.